మహబూబ్‌నగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాన్ని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరామర్శించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ పాలకొండ ఘటన బాధాకరమని, ఐదుగురు మృతికి పోలీస్ అధికారులే బాధ్యత వహించాలన్నారు. బైపాస్‌లో అర్ధరాత్రులు బైక్ రైడర్స్ స్పీడ్‌గా చక్కర్లు కొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ పోలీస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచి పేరు ఉండేదని.. కొంద రు అవినీతి అధికారుల తీరు కారణంగా చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రజల భద్రతకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే వారిపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల వెడ ల్పు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు గత ఎన్నికల ముందే నిధులు తీసుకొచ్చామని, వాటిని వెంటనే ఏర్పాటు చే యాలని డిమాండ్ చే శారు. బైపాస్‌లో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయని ఫి ర్యాదులు అందుతు న్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉంటే ప్రమాదాలు జరిగేవి కాదన్నారు. కార్పొరేషన్ కమిషనర్ అలసత్వం కూడా మ్రాదానికి కారణమ న్నారు. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు సైతం ప్రమాదాలు తగ్గించేందుకు బా ధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్ అధికారుల తీరు సరిగ్గా లేదని, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను ఇ బ్బంది పెట్టడం మానుకోవాలని సూచించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అన్ని వసతులు కల్పించి త్వరగా ప్రారంభించాలని, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలిపేందుకు ఉపయోగపడుతుందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండే.. కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉందో? ప్రజలు ఆలోచన చేయాలన్నా రు. ప్రజల పక్షాన మాట్లాడి వారికి మంచి చేయాలని నేను ప్రశ్నిస్తే శ్రీనివాస్‌గౌడ్‌ని తిట్టించడానికి ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు.. ఇది ఎల్లకాలం నడవదని, ప్రజలు చూస్తు న్నార న్నారు. మాజీ మంత్రి వెంట పార్టీ నాయకులు గంజి వెంకన్న, కేసీ నర్సింహులు, శ్రీకాంత్ గౌడ్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.