బండి.. పదవి నుంచి తప్పుకో..
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడా రు.
- కొడుకును అదుపులో పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
- మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న వేధింపులు
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం
మహబూబ్‌నగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడా రు. బాధ్యత కలిగిన కేంద్రమంత్రి పదవిలో ఉన్న సం జయ్ కొడుకును ర్యాగింగ్ చేసిన సమయంలోనే అ దుపులో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కా దన్నారు. కొడుకును గాలికి వదిలేయడం తో అమ్మాయి జీ వితంతో చెలగాటం అడిండు.. ఒక కేంద్రమంత్రి కొ డుకే ఇలా ప్రవర్తిస్తే రాష్ట్రం లో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
పోక్సో కేసు పెట్టిన ఇప్పటివరకు పోలీసులు కనీసం విచారణకు కూడా పిలవలేదని.. పైగా బాధితులకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. తనపై జరిగిన అన్యాయానికి మెనర్ బాలి క తల్లిదండ్రులు కేసు పెడితే పోలీసులు తీసుకోలేదు.. పైగా బాలికపై తెలివిగా వేరే ప్రాంతం లో కేసులు పెట్టించారన్నారు. పో లీసు వ్యవస్థ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. రాష్ట్ర ంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గతంలో తెలంగాణ పో లీస్ అంటే దే శంలో నే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని, ప్రస్తుతం పోలీస్ వ్య వస్థ సెటిల్మెంట్లు, ఇసుక దం దాలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయిందన్నారు. 80శాతం మంది ఆఫీసర్లు హానెస్ట్‌గా పనిచేసినా కేవలం కొద్దిమంది వల్ల పో లీస్ శాఖ పరువుపోతుందన్నారు.
నిజాయితీ గల పోలీసుల మాట ఎవరూ వినడం లేదని ఆవేదన చెందారు. ఒక కేంద్రమంత్రి కొడుకు తప్పు చేస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు. అదే సామాన్యులు చేస్తే ఏం చేసేవారో ప్రజలు గ్రహి ంచాలన్నారు. కూకట్‌పల్లిలో ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేసారు.. మాజీ డీజీపీ భా ర్యను చంపి దొంగతనం చేసారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుగంటిపోయాయని చెప్పడానికి ఈ ఘటనలు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని లేదా కొడుకుపై వచ్చిన ఆరోపణలకు జవాబుదారిగా స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. హిందువులు.. ముస్లింలను రెచ్చగొట్టుడు తప్పా సంజయ్ రాష్టానికి చేసిందేమి లేదన్నారు.
కేసీఆర్, కేటీఆర్ మీద నోరు పారేసుకోవడం, తప్పుడు ఆరోపణలు చేయడం తప్పా బాధ్యతగా వ్యవహరించాలని అనుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయని అనడానికి బండి కొడుకు కేసు ని దర్శనమన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించా యి.. పెట్టుబడులు రావాలంటే క్రైమ్ రేట్ చూస్తారు.. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటి నుంచి పెట్టుబడులు రావడం కష్టమవుతుందని, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు. సమావేశంలో నాయకులు కేసీ నర్సింహులు, గంజి వెంకన్న, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

