కూసుమంచి, మే 11 : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. చౌటపల్లికి చెందిన దామళ్ల సుధాకర్ (50) తనకున్న వ్యవసాయ భూమితోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. దిగుబడి వచ్చినా చేసిన అప్పులు తీరకపోవడం.. అప్పులు ఇచ్చిన వారు ఇంటిచుట్టూ తిరుగుతుండటంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.