పాలమూరు, మార్చి 29 : మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రప తి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, స్వాభిమానానికి గొప్ప ఆదర్శమన్నా రు.
అదే విధంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని, తల్లిదండ్రులను భక్తిభావంతో పూజించేలా ఆదర్శవంతమైన జీవితం గడపాలన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులోనే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరా డి స్వరాజ్యం స్థాపించినట్లు, యువత కూడా సోమరితనం, విదేశీ సంస్కృతి, బానిసత్వం వదిలి తమ సంస్కృతి, భాష, దేశం కోసం నిలబడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వాయుపుత్ర యువసేన సంఘం సభ్యులు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.