ఇరాన్-ఇజ్రాయిల్ వార్ గురించి
ఇలియ్డ్ ఒడిస్సీ గురించి
పుంఖానుపుంఖాలుగా కవిత్వాలు రాసే ఓ కవీ!
ఒక్కసారి గ్యాస్ సిలిండర్‌ని
స్టవ్‌కి ఫిక్స్ చేసి చూడు..అదీ కవిత్వమే!
సమానత్వం-సంస్కారం గురించి
మానవత్వం-మంచితనం గురించి
గంటలకొద్దీ విశ్లేషణలు చేసే కథకుడా!
ఒక్కసారి ఇంట్లో బట్టలను సర్దిచూడు..అది ఓ చక్కని కథే!
ఇతిహాసాలు-పురాణాల గురించి
మతగ్రంథాలు ధర్మసూక్ష్మాల గురించి
గొంతు చించుకొని వివరించే ప్రవచనకర్త!
ఒక్కసారి ఇల్లు ఊడ్చి తుడిచి చూడు..అదీ గొప్ప ధర్మమే!
వందలాది పాత్రలను కొత్త గెటప్‌లు-
రకరకాల కాస్ట్యూమ్‌లతో
క్షణంలో మార్చే కళాకారుడా!
బట్టలు వాషింగ్ మెషిన్లో
ఉతికి ఆరేసి చూడు..అది ఓ చక్కని కళే!
విప్లవం-మార్పు-సామాజిక చైతన్యం గురించి
పునరుజ్జీవనం-మేధోవికాసం-శాస్త్రవిజ్ఞానం గురించి
అనర్గళంగా వ్యాఖ్యానించే మేధావీ!
ఒక్కసారి పుస్తకాలన్నింటినీ ర్యాక్‌లో పెట్టి చూడు
అదీ గొప్ప జ్ఞానమే!
భావాలకు వాక్యాన్ని ఆలోచనలకు
అక్షరాన్ని అలంకరించి
పాఠకులందరినీ జాగృతం
చేసే సాహితీమూర్తి!
ఒక్కసారి తోని వంట చేసి చూడు..
అదీ ఓ మహాసృజనే!
చేసే మనసుంటే సర్వం సాహిత్యమే!
సకలం కళాభరితమే!
-డాక్టర్ దుంపా శ్రీదేవి
9440481111