న్యూఢిల్లీ: విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నట్వర్ సింగ్ రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో 1931లో జన్మించారు. ఆయన దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించారు. దౌత్య రంగంలో సాధించిన అనుభవాన్ని రాజకీయ రంగానికి జోడించి సేవలందించారు. ఆయనకు 1984లో ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. 2004-05 మధ్య కాలంలో యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా పని చేశారు.