న్యూఢిలీ, మే 22: మనీ లాండరింగ్ కేసులో అరస్టై, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు.
జైలులో ఒంటరితనం వల్ల తాను ఆందోళనకు గురవుతున్నారని ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. జైన్ ఆరోగ్యంపై న్యాయవాది గత వారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.