హైదరాబాద్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar ) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం (KCR Condolence) ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజలతో ఎంతో అనుబంధమున్న నాయకుడు అజిత్ పవార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని నష్టమని, ఆయన కుటుంబం, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar) తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.