KCR | అజిత్ పవార్ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar ) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం (KCR Condolence) ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా ఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజలతో ఎంతో అనుబంధమున్న నాయకుడు అజిత్ పవార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని నష్టమని, ఆయన కుటుంబం, సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ( Ajit Pawar) తో పాటు మరో 5గురు విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారమతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చార్టెడ్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

