సిరిసిల్ల టౌన్, జూలై 19: నిబంధనల సాకుతో రైతుల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు. శుక్రవా రం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కేవలం రూ. 6 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసి రూ.31 కోట్లు మాఫీ చేసినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ.16 వేల కోట్లతో 35లక్షల మందికి, 2023లో రూ.19 వేల కోట్లతో 38 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా, పట్టణాధ్యక్షులు, తోట ఆగయ్య, జిందం చక్రపాణి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఉన్నారు.