హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): బీసీలకు విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని.. అందుకు కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చొరవచూపాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు రాహుల్‌గాంధీకి గురువారం బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని మించవచ్చని, న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఎదురొనేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కోరారు.