
రైతన్న కోసం పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయమై.. కర్షకులకు వ్యతి రేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజ మెత్తారు. కేంద్రం తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి పార్లమెంట్లో పోడియం వద్ద రోజంతా ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టారు. దీన్ని రైతులు ప్రశంసిస్తున్నారు.
కేంద్రం తీరు దేశం మొత్తానికి తెలిసేలా నిరసన వ్యక్తం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి సైతం రైతుల కోసం తమ ఆందోళన కొనసాగించడాన్ని పాలమూరు రైతులు స్వాగతిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం రైతుకు మద్దతుగా నిలవలేదు. దీన్నిబట్టి టీఆర్ఎస్ ముమ్మాటికీ రైతు పక్షపాతే అని అర్థమైంది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల కు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీల పోరాటం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఆది నుంచి పోరాటం చేస్తున్న అధికార పార్టీ.. పార్లమెం ట్ వేదికగా కూడా తమ గళాన్ని వినిపించడాన్ని అన్నదాతలు, రైతు సంఘాల నేతలు ఆహ్వానిస్తున్నారు. యాసంగి ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాల్సిందేనంటూ ఇందిరా పార్క్ వేదికగా కేంద్రం తీరును నిరసిస్తూ.. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ధర్నా నిర్వహించడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందంటున్నారు. అందుకే కేంద్రం తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి పార్లమెంట్లో పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు రోజంతా ధర్నా చేసిన తీరును రైతులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు దేశం మొత్తానికి తెలిసేలా చేశారంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి సైతం రైతుల కోసం తమ ఆందోళన కొనసాగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో.., ముఖ్యంగా ఉమ్మ డి జిల్లాలో వరి సాగవుతున్నది. ఏడేండ్లలో ప్రాజెక్టుల ద్వారా పుష్కలం గా సాగునీరు అందించడం వల్లే పంటలు పండించుకుంటున్నామని.., ఇ లాంటి పరిస్థితుల్లో తాము పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చే యాల్సిందేనని పేర్కొంటున్నారు. కేంద్రంపై పోరాటంలో రాష్ర్టానికే చెంది న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం వహించడంపైనా ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ మాత్రమే పనిచేస్తుందని, తమ కోసం ఆందోళన చేస్తున్న ఎంపీలకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇతర పార్టీలూ స్పందించాలి..
ధాన్యం కొనుగోలు చేయాలని ప్రశ్నించిన ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం సరికాదు. దీనిపై ఇతర పార్టీలు స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే రైతులపై వారికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లు రైతులకు ఇబ్బందిగా ఉంది. వెంటనే రద్దు చేయాలి. బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నది. తప్పులను ప్రశ్నిస్తున్నారని సస్పెండ్ చేయడం తగదు. కేంద్రం వెంటనే సస్పెన్షన్ ఎత్తి వేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి ఆందోళనలు చేస్తాం.
పట్టించుకోని ప్రతిపక్షాలు..
పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై ఫ్లకార్డులతో నిరసన తెలుపుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం బాధాకరం. రాష్ట్ర వాణి వినిపించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుంటే కనీసం మద్దతు తెలిపే ప్రయత్నం కూడా చేయకుండా అవాకులు, చవాకులు పేలుతున్నారు. దీనంతటినీ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు.
రైతులకు అండగా రాష్ట్ర సర్కార్..
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. అప్రతిష్టపాలు చేయాలన్న లక్ష్యంతో పార్లమెంట్ సమావేశంలో కేవలం టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన పోరాడుతుంటే కనీసం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రైతుల గురించి మాట్లాడనే లేదు. సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు కోసం నిరసనకు రాష్ట్రంలోని రైతులు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
కేంద్రం తీరును ఎండగట్టాలి..
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నది. ధాన్యాన్ని కొను గోలు చేయాలి. కొనుగోళ్ల విషయం లో స్పష్టత ఇవ్వాలి. రైతుల పక్షాన నిలబడి టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ఇతర పార్టీలు మద్దతు తెలపాలి. కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే 750 మంది రైతులు మరణించారు. దీనికి ఎవరు భాద్యత వహించాలి. కేంద్రంవారికి ఎక్స్‌గ్రేషియా అందించాలి.
ఎంపీల చిత్తశుద్ధికి నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కేంద్రం 40 లక్షల ఎకరాల్లో మాత్రమే ధాన్యం కొంటామని చెప్పడం ఒక రకంగా రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడమే. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో చేపట్టాలి. పార్లమెంట్లో కొనుగోలు, రైతు చట్టాల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు చేసిన పోరాటం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఇకనైనా మేల్కొని రైతుల పక్షాన పోరాటం చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వారిని గ్రామాల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటాం.