Lionel Messi : ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సి (Lionel Messi) హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. భారత పర్యటనలో మొదటి నగరమైన కోల్‌కతాలో అభిమానులను అలరించిన ఫుట్‌బాల్ మాంత్రికుడు శనివారం శంషాబాద్ విమాశ్రయంలో దిగాడు. భారీ భద్రత నడుమ మెస్సి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నాడు. 100 మందితో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ ఫొటో సెషన్ కార్యక్రమంలో పాల్గొంటాడు మెస్సి. ఫుట్‌బాల్ దిగ్గజాన్ని కలిసేందుకు క్యూఆర్ కోడ్ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు.
అనంతరం సాయంత్రం 6:30 గంటలకు మెస్సి బృందం 20 వాహనాల కాన్వాయ్‌లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకోనుంది. అక్కడ మైదానంలో 30 మంది పిల్లలకు ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చిన తర్వాత మెస్సి, రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతాడు. ఆ తర్వాత విన్నర్, రన్నరప్ జట్లకు బహుమతులు ప్రదానం చేస్తాడు ఫుట్‌బాల్ స్టార్.
Lionel Messi has arrived at Hyderabad airport.
#Messi #MessiInIndia #MessiInHyderabad #GOATIndiaTour pic.twitter.com/JDYDaV8hs0
— Marx2.O (@Marx2PointO) December 13, 2025
అయితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్ రెడ్డి స్టేడియానికి వెళ్లి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
#WATCH | West Bengal: Star footballer Lionel Messi greets his fans at Salt Lake Stadium in Kolkata
A friendly match and a felicitation ceremony will be organised here. #Messi𓃵 #MessiInIndia
(Video Source: DD Sports) pic.twitter.com/BmxhJ7PQAT
— ANI (@ANI) December 13, 2025