తాండూరు, డిసెంబర్ 10: రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్నది. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థినులను తాండూ రు ప్రభుత్వ దవాఖానకు తరలించి, వైద్యం అందించారు. తాండూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న సుమారు 180 మంది విద్యార్థినులు ఉన్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు పాఠశాలలో అల్పాహారం కింద కిచిడీ తిన్నారు. 9.30 గంటల ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి అంటూ రోదించడం మొదలుపెట్టారు.
వెంటనే వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దవాఖానలో చేరిన ఎనిమిదో తరగతి విద్యార్థినులు గీత, గూలిబాయి, శైలజ, శ్రావణికి వైద్యులు చికిత్స అందించారు. ఫుడ్ పా యిజన్ కారణంగానే వారికి కడుపునొప్పి వచ్చినట్టుగా వైద్యులు వెల్లడించారు. స్లైన్ ఎక్కించిన తర్వాత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో డిశ్చార్జి చేశారు. వాస్తవానికి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటికి పొక్కింది. ఘటనా స్థలానికి ప్రభుత్వ సి బ్బందితోపాటు మీడియా వెళ్లడంతో హాస్టల్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. బాధిత విద్యార్థినులను విద్యార్థి సంఘాల నేతలు, బీఆర్ఎస్ ప్రతినిధులు దవాఖానలో పరామర్శించారు. ఘటనకు కారణమైన వారి
వారం రోజులుగా పురుగులే…
పాఠశాలలో వారం రోజులుగా తిండి సరి గా ఉండటం లేదని కడుపునొప్పితో బాధపడిన విద్యార్థిని గూలిబాయి ‘నమస్తే తెలంగాణ’తో తెలిపింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది.
నొప్పి భరించలేం..
కలుషిత ఆహారం పెట్టడంతోనే అస్వస్థత కు గురయ్యాను. భరించలేని నొప్పులు ఉన్నా యి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపిస్తలేదు. మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది. – శైలు, విద్యార్థిని
కారకులను శిక్షించాలి
మాకు సరైన సౌక ర్యం, స్థోమత లేకనే నా బిడ్డను హాస్టల్లో చదివిస్తున్నాం. కానీ, ఇక్కడ మా బిడ్డలు నరకం అనుభవిస్తరని కలలో కూడా అనుకోలేం. తిండే సరిగా పెట్టకపోవడం ఏంటి? ఈ తప్పు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి.
– అనూషబాయి, విద్యార్థిని తల్లి
హాస్టళ్లు నరకానికి ఆనవాళ్లు
రాష్ట్రంలో వసతిగృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. వి ద్యార్థులకు ఇబ్బందు లు తలెత్తుతున్నా సీ ఎం స్పందించకపోవడం విడ్డూరం. హాస్ట ళ్లో చావుడప్పులు మోగుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు. – శుభప్రద్‌పటేల్,రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
భోజనం సరిగా పెట్టడం లేదు
కొన్ని రోజులుగా కుళ్లిన కూరగాయలతోనే వంట చేస్తున్నారు. వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిందే మేం పెడుతున్నమని చెబుతున్నది. మా అమ్మానాన్నలు వచ్చినా లోపలికి అనుమతించరు. గతంలో చాలా బాగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉన్నది. – సింధుబాయి, విద్యార్థిని
పురుగులన్నమే దిక్కు
మాకు పురుగుల అన్నమే పెడుతున్నారు. తిండిపదార్థాలు వాసన వస్తున్నాయి. అవి తినటంతోనే మాకు ఇలా జరిగింది. ఈ హాస్టళ్లో ఉం డాలంటే భయమైతున్నది. బాగోలేని ఆహారం పెడుతున్నరు. నీళ్లు కూడా సరిగా లేవు.
– అంగూరిబాయి, విద్యార్థిని