Food Delivery | బీజింగ్, ఆగస్టు 23: చైనా డ్రోన్ల ద్వారా ఆహార డెలివరీని ప్రారంభించింది. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించేవారికి ఫుడ్ డెలివరీ దిగ్గజం మెయిటువాన్ ఈ సేవలు అందించనుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద ఓ హోటల్ పైకప్పు నుంచి సమీపంలోని వాచ్ టవర్ వరకు ఈ సేవలను ఏర్పాటు చేసినట్టు మెయిటువాన్ డైరెక్టర్ యాన్ యాన్ తెలిపారు.
సాధారణంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం 50 నిమిషాల సమయం పడుతుందని, అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 5 నిమిషాల్లోనే చేరవేయవచ్చని చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకే ఆర్డర్లను స్వీకరిస్తామని, ఆ తర్వాత గ్రేట్ వాల్‌పై పర్యాటకులు పడేసిన వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తామని తెలిపింది.