శ్రీశైలం : ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయానికి ( Srisailam reservoir) వరద పోటేత్తుతుంది. ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలాశయానికి జూరాల( Jurala ) , సుంకేశుల( Sunkesula ) ప్రాజెక్టుల నుంచి బారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 10 గేట్లను 12 అడుగుల ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,04,658 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,81,392 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు . ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 215.80 టీఎంసీలకు గాను 204.35 టీఎంసీల నీరు నిలువ ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.