హైదరాబాద్ : ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 10,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 12,169 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 587.60 అడుగుల మేర నీరుంది. గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 305.8626 టీఎంసీలు నిల్వ ఉన్నది.