Flipkart | కస్టమర్ అనుమతి లేకుండా ఐ-ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంపై సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.10 వేల జరిమాన విధించింది. దాదర్ వాసి 2022 జూలై 10న ఫ్లిప్‌కార్ట్‌లో క్రెడిట్ కార్డు ద్వారా రూ.39,628లకు ఐఫోన్ ఆర్డర్ చేశారు. జూలై 12న ఆయనకు ఐ-ఫోన్ డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఆరు రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ కస్టమర్ ఈ విషయమై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే తమ ఈ-కార్ట్ ప్రతినిధి పలు సార్లు ఫోన్ డెలివరీకి ప్రయత్నించినా, సదరు కస్టమర్ అందుబాటులో లేరని పేర్కొంది.
దీనిపై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫ్లిప్ కార్ట్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. తన ఆర్డర్‌ను ఫ్లిప్‌కార్ట్ క్యాన్సిల్ చేయడంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు మనోవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ఇది ఆన్ లైన్ మోసం కిందకు వస్తుందన్నారు. దీనిపై ఫ్లిప్ కార్ట్ వివరణ సంతృప్తికరంగా లేదు. ఏకపక్షంగా ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్లు తేలడంతో ఫ్లిప్ కార్ట్.. సంబంధిత కస్టమర్ కు రూ.10 వేల జరిమాన చెల్లించాల్సిందేనని ఆదేశించింది.