అహ్మదాబాద్ : స్పా పేరుతో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్ వస్త్రపూర్ ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం రట్టు చేశారు. వస్త్రపూర్ చెరువు సమీపంలోని ఆమ్రపాలి లేక్‌వ్యూ టవర్ బీ వింగ్‌లో హ్యాపీ ఇంటర్నేషనల్ స్పా అండ్ హమామ్ పేరు కలిగిన స్పాలో చీకటి దందా నిర్వహిస్తున్నారనే సమాచారంతో క్రైం బ్రాంచ్‌కు చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందం దాడులు చేపట్టింది.
వ్యభిచార ముఠా ఆట కట్టించేందుకు పోలీసుల బృందం ఓ వ్యక్తి (29)ని కస్టమర్ మాదిరిగా పంపించింది. యువకుడు స్పాకు వెళ్లగా మేనేజర్ పలు మహిళల ఫోటోలు చూపాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు స్పా మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. మహిళా కానిస్టేబుల్ స్పాకు చేరుకోగా అందులో నాలుగు చిన్న రూమ్‌లలో యువతులు కస్టమర్ల కోసం వేచిచూస్తున్నారు.
మహిళలను అంబవది, బోపాల్, ఇసాన్‌పూర్, వస్త్రపూర్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. అరెస్టయిన నిందితుడు స్పాలో పనిచేసే దిలీప్ ఠాకూర్‌గా గుర్తించారు. ఇతడు నెలకు రూ 20,000 వేతనంతో స్పాలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన స్పా యజమాని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.