బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మెట్రోపాలిటన్ పోలీస్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ చరిన్ గోపట్ట తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యవసాయోత్పత్తుల మార్కెట్లో జరిగిన ఈ సంఘటనలో ఐదుగురు సెక్యూరిటీ గార్డులు మరణించారు.
అనంతరం ఆ దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దుండగుడిని గుర్తించేందుకు, ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతున్నది. ఈ సంఘటనలో పర్యాటకులకు ఎటువంటి హాని జరగలేదు.