Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్‌గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె బాలింగ్ పోలీసు స్టేషన్ (K Baling Police Station) పరిధిలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ మార్గంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారణంగా బస్సు రాంగ్ రూట్లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Also Read..
Ladakh Violence | లద్ధాఖ్‌లో ఆందోళనలు.. 50 మంది అరెస్ట్
Ladakh Violence | లద్దాఖ్‌లో జరిగింది జన్ జెడ్ నిరసనలు కాదు.. కాంగ్రెస్ నిరసన : బీజేపీ