Hyderabad | హైదరాబాద్ : ఓయో రూమ్( Oyo Room )లో ఘోరం జరిగింది. ఓ వైద్యుడి( Doctor )పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డేటింగ్ యాప్( Dating App ) ద్వారా కలుసుకున్న అనంతరం ఓయో రూమ్లో కలిశాక ఈ ఘోరానికి యువకుడు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడితో వైద్యుడికి పరిచయం ఏర్పడింది. ఇక ఇదే యాప్లో సదరు యువకుడితో డాక్టర్ కొనసాగించాడు. ఇటీవల కలుసుకుందామని నిర్ణయించుకున్న అనంతరం ఇద్దరు కలిసి ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. గదికి వెళ్లాక యువకుడు వైద్యుడిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. దీంతో వైద్యుడు ప్రతిఘటించారు. దీంతో వైద్యుడిపై దాడి చేసి, డబ్బులు ఇవ్వకపోతే రహస్యంగా కలిసిన విషయాన్ని బయటపెడతానని యువకుడు బెదిరించాడు. డబ్బులు ఇచ్చినా కూడా సదరు యువకుడు అతను పని చేసే ఆసుపత్రి వరకు వెళ్లి గొడవ చేయడంతో, చేసేదేమీ లేక వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. వైద్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.