Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూడూరు మండలం రాకంచర్ల దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులంతా కొడంగల్ మండలం ఫర్సాపూర్ తండావాసులుగా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ముందుగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.