Fitness Tips : సమ్మర్ రానుండటంతో వేసవికి ముందు బరువు తగ్గేందుకు జార్జియాకు చెందిన ప్రముఖ మహిళా వెయిట్ లాస్ కోచ్ జెన్నా రిజో సులభమైన మార్గాలను సూచించారు. అనూహ్యంగా బరువు తగ్గేందుకు బదులు దశల వారీగా మార్పు సాధించాలని, నెమ్మదిగా, నిలకడగా ముందుకెళుతూ మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఇటీవల ఓ వీడియోలో రిజో వెల్లడించారు.
View this post on Instagram
A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee)
శారీరక వ్యాయామం కీలకమని, జిమ్లో గంటల తరబడి వర్కవుట్లు చేయడం కన్నా రోజూ కొన్ని వేల అడుగుల లక్ష్యం నిర్ధేశించుకోవడం లేదా రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయడం సరిపోతుందని చెపక్పారు. రోజూ మధ్యస్ధంగా కష్టపడేలా వ్యాయామాన్ని ఎంచుకుంటే పలు వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక వన్ సూప్ రూల్ను పాటించాలని, కఠినమైన ఆహార నియమాలు పాటించేందుకు బదులు రోజూ భోజనంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలని రిజో సూచించారు.
View this post on Instagram
A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee)
ఇది దీర్ఘకాలిక ఆరోగ్యకర ఆహార అలవాట్లకు దారితీస్తుందని చెప్పారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి సంస్ధల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సూచన పాటించాలని అన్నారు. ఇక చివరిగా ప్రతిరోజూ రాత్రి కనీసం ఏడు గంటల పాటు నిద్రించడం ముఖ్యమని రిజో చెబుతున్నారు. హార్మోన్ల నియంత్రణ, భావోద్వేగాల నియంత్రణ సహా తగినంత నిద్ర శరీరానికి అవసరమని అన్నారు.
Read More :