కోల్కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని పార్క్ షో సినిమా హాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం సినిమా హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఫైర్ డిపార్టుమెంట్ వారికి సమాచారం ఇచ్చి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మొత్తం ఐదు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరుగలేదని పోలీసులు తెలిపారు. అయితే, థియేటర్లోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
కాగా, గత వారం కూడా మహారాష్ట్రలోని శిల్పటా ఏరియాలోగల ఖాన్ కాంపౌండ్లో ఒక ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా భారీగా ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
West Bengal | Fire breaks out at Kolkata's Park show cinema hall; 5 fire tenders on the spot pic.twitter.com/94eIRIQVE2
— ANI (@ANI) January 18, 2022