Kalyan Ram | శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్
Kalyan Ram | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆహ్వానం తెలుపుతూ ఆలయ మర్యాదలతో లోపలికి తీసుకెళ్లగా, హీరో రాకతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా సందడిగా మారింది.
Kalyan Ram | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ మంగళవారం విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆహ్వానం తెలుపుతూ ఆలయ మర్యాదలతో లోపలికి తీసుకెళ్లగా, హీరో రాకతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా సందడిగా మారింది. భక్తులు, అభిమానులు ఆయనను ఒక చూపు చూడాలనే ఆసక్తితో గుమిగూడారు.ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం కళ్యాణ్ రామ్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా రాహు–కేతు పూజలు నిర్వహించారు.
అనంతరం అంతరాలయ దర్శన సౌభాగ్యం కల్పించగా, స్వామివారి సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేస్తూ ప్రార్థనలు చేశారు. ఆలయంలో ఆ సమయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తి భావం వెల్లివిరిసింది. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించగా, కళ్యాణ్ రామ్ వినయంగా నమస్కరించి ఆశీస్సులు స్వీకరించారు. దేవస్థాన ఆచార సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు సక్రమంగా పూర్తయ్యాయి.ఈ దర్శన కార్యక్రమంలో ఆలయ ఏపీఆర్వో రవి, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొని భద్రతా ఏర్పాట్లు, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
అలాగే టీడీపీ నాయకులు నాగమల్లి దుర్గాప్రసాద్, బాలాజీ రెడ్డి తదితరులు హాజరై కళ్యాణ్ రామ్‌కు స్వాగతం పలికారు.ప్రముఖ సినీ నటుడు ఆలయాన్ని సందర్శించడం భక్తుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. కొందరు అభిమానులు ఆలయం బయట వేచి ఉండి ఆయనకు అభివాదం చేశారు. మొత్తం మీద నందమూరి కళ్యాణ్ రామ్ శ్రీకాళహస్తి సందర్శనంకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

