fire broke out | ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 125 మంది రోగులు తరలింపు
fire broke out | ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
అహ్మదాబాద్: ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు షాహిబాగ్ ప్రాంతంలోని పది అంతస్తులున్న రాజస్థాన్ ఆసుపత్రి బేస్మెంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది 12 అగ్నిమాపక వాహనాలతో అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రి బేస్మెంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశారు.
కాగా, ఆ ఆసుపత్రి బేస్మెంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంచిన వస్తువుల నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు చెప్పారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 125 మంది రోగులను ఆసుపత్రి నుంచి ఖాళీ చేయించినట్టు తెలిపారు. నగరంలోని పలు ఆసుపత్రులకు ఆ రోగులను తరలించినట్టు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని పోలీస్ అధికారి తెలిపారు. మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

