Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్నిప్రమాదాలు.. ! భయాందోళనలో జనం : వీడియో
Fire accidents | దీపావళి పండుగ(,Diwali festival) వేళ హైదరాబాద్లోని(Hyderabad)పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు(Fire accidents) ప్రజలను కంటిమీద కునుకు చేలుకుండా చేశాయి.
Fire accidents | దీపావళి పండుగ(,Diwali festival) వేళ హైదరాబాద్లోని(Hyderabad)పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు(Fire accidents) ప్రజలను కంటిమీద కునుకు చేలుకుండా చేశాయి. అసలే పటాకుల మోతతో హోరెత్తిపోతుంటే మరోవైపు ఎప్పుడు ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయంతో వణికిపోయారు.ఈ ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. బేగంబజార్, కూకట్పల్లి, జీడిమెట్ల, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్మండిలో దీపావళికి అంటించిన ఓ రాకెట్ బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా షాపులోని క్రాకర్స్ అన్నీ పేలి, మంటలు భారీగా ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో జనాలు, వాహనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
కాటేదాన్లో ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. క్షణాల్లో పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు మంటలు వ్యాపించాయి. దట్టంగా వ్యాపించిన నల్లటి పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. భారీగా ఆస్తి నష్టం జరుగా పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. అలాగే కూకట్పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో నెయ్యి, కుర్కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్నిప్రమాదాలు.. ! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

