Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
Ramayana | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రత్యేక చర్చకు దారితీశాయి.
Ramayana | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపురుష్’, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రత్యేక చర్చకు దారితీశాయి. అయితే ఈ రెండు చిత్రాల గ్రాఫిక్స్‌ను పోల్చి చూస్తే కొన్ని అంశాల్లో ‘ఆదిపురుష్’కే ఎక్కువ మార్కులు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆదిపురుష్’ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే టీజర్ విడుదలైన తర్వాత అందులోని విజువల్స్‌పై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యాయి. దీంతో సినిమాపై నెగిటివిటీ పెరిగింది. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లో కొన్ని మెరుగైన విజువల్స్ కనిపించడంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా భారీ ఆకారాలతో కనిపించే పాత్రలు, యాక్షన్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
మరోవైపు ‘రామాయణ’కు సంబంధించిన విజువల్స్‌కు కొంతమేర ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా కొన్ని భారీ సన్నివేశాలు, ప్రపంచ నిర్మాణం ఆకట్టుకునేలా ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాక్షస పాత్రల రూపకల్పన, వాటి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి.‘రామాయణ’లో కుంభకర్ణుడు, ఇతర రాక్షసులను భారీ ఆకారాల్లో చూపించిన కొన్ని సన్నివేశాలు తెరపై సహజంగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పాత్రలు యానిమేషన్ బొమ్మల్లా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇదే విషయంలో ‘ఆదిపురుష్’లోని కొన్ని విజువల్స్ మెరుగ్గా ఉన్నాయని అభిమానులు పోల్చి చెబుతున్నారు. హనుమంతుడు, కుంభకర్ణుడి భారీ రూపాలు, సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడికి సంబంధించిన గబ్బిలాల సన్నివేశాలు, చివర్లో ప్రభాస్ పాత్ర హనుమంతుడి వీపుపై కనిపించే సన్నివేశం వంటి వాటిలో గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఆయా సన్నివేశాల్లో పాత్రల పరిమాణం, వాటి కదలికలు, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ‘ఆదిపురుష్’ కొంత సహజత్వాన్ని చూపించిందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ‘ఆదిపురుష్’, ‘రామాయణ’ చిత్రాలు రెండూ భారీ విజువల్ ప్రాధాన్యతతో రూపొందినవే. అయితే ఒక సినిమాలో బలంగా కనిపించిన అంశం మరో సినిమాలో అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ‘రామాయణ’లో కొన్ని విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, రాక్షస పాత్రల గ్రాఫిక్స్ విషయంలో మాత్రం మరింత మెరుగుదల అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

