పోలీసుల దారిదోపిడీ!
విధినిర్వహణలో భాగంగా ఆ స్టేషన్ పోలీసులు సాయంత్రం షేక్‌పేటలో పెట్రోలింగ్‌కు వెళ్లారు. సాధారణంగా పెట్రోలింగ్‌లో ఉన్నవారు ఆ ప్రాంతంలో వచ్చి పోయే వాహనాలు, మనుషుల కదలికలను గమనిస్తూ ఏదైనా అనుమానాస్పద వ్యవహారం ఉంటే పసిగట్టి స్టేషన్‌కు తీసుకెళ్లి ఆరా తీసి ఆ తర్వాత చేయాల్సిన పని చేయాలి.
-
షేక్‌పేటలో బాధితుడి నుంచి రూ.50 వేలు లాక్కున్న వైనం
-
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి
-
కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
-
కీలక సూత్రధారి ఎస్ఐపై మాత్రం నో యాక్షన్
-
ఉన్నతాధికారి సలహా..డ్యూటీ రిజిస్టర్లో పేరులేకుండా తప్పించుకున్న ఎస్ఐ
-
కానిస్టేబుల్‌కు పారిపోవాలంటూ.. చెప్పింది కూడా ఆ అధికారేనట!
విధినిర్వహణలో భాగంగా ఆ స్టేషన్ పోలీసులు సాయంత్రం షేక్‌పేటలో పెట్రోలింగ్‌కు వెళ్లారు. సాధారణంగా పెట్రోలింగ్‌లో ఉన్నవారు ఆ ప్రాంతంలో వచ్చి పోయే వాహనాలు, మనుషుల కదలికలను గమనిస్తూ ఏదైనా అనుమానాస్పద వ్యవహారం ఉంటే పసిగట్టి స్టేషన్‌కు తీసుకెళ్లి ఆరా తీసి ఆ తర్వాత చేయాల్సిన పని చేయాలి. వీళ్లూ అదే పని చేశారు. కానీ వచ్చీపోయే వారిని గమనిస్తూ ఒకరి చేతిలో డబ్బులు కనిపించగానే పోలీసులమంటూ అదిలించి అతని చేతిలో కొంత డబ్బు గుంజుకున్నారు. తనకు అత్యవసరమని చెప్పినా వినకుండా డబ్బులు లాక్కుని వెళ్లిపోయారు. పోలీసుల దారిదోపిడీ ప్రస్తుతం కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈవ్యవహారంపై సదరు పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తూ అందుకు బాధ్యులను చేస్తూ ఒక కానిస్టేబుల్, హోంగార్డుపై ఎఫ్ఐఆర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి అసలు సూత్రధారులెక్కడ. ఆ కానిస్టేబుల్ ఎందుకు పారిపోయాడు. ప్రస్తుతం అదే పోలీసుస్టేషన్‌తో పాటు నిఘావర్గాల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. నాలుగురోజుల కిందట షేక్‌పేటలో జరిగిన సంఘటన కమిషనరేట్‌లో కొందరు అక్రమార్కులైన పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా చూపిస్తోంది.
సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలోని చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉండే పోలీసు స్టేషన్ అది. ప్రతీసారి ఏదో ఒక వ్యవహారంతో ఆ పోలీసు స్టేషన్ వార్తల్లోకి ఎక్కుతుంది. తాజా సంఘటనలోనూ ఖాకీలే దారిదోపిడీదారులుగా మారిన వైనం కమిషనరేట్ పోలీసులకు తలవంపులు తెచ్చిపెడుతున్నదని సీనియర్ అధికారులు అంటున్నారు. అసలు జరిగిందేంటంటే ఈనెల 4న ఒక వ్యక్తి తనకు అత్యవసరంగా ఉందంటూ తన స్నేహితుడిని డబ్బులు అడిగితే అతను షేక్‌పేట నాలా వద్దకు తెచ్చి ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతను డబ్బులు లెక్కపెడుతుండగా పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు ఆ డబ్బులను గమనించారు. అతను బ్యాగులో పెట్టుకుంటుండగా అతనిని ఆపి నీ దగ్గర ఏమున్నాయి అని అడిగి.. అతను భయపడి స్వీటుబాక్సు అని చెప్పడంతో మరింత రెచ్చిపోయి జీపు ఎక్కు అంటూ గట్టిగా బెదిరించారు. ఆ బ్యాగులో ఏమున్నాయంటూ చూడడంతో డబ్బులు కనిపించాయి.

దాంతో తమకు 70వేలు ఇవాలని అడిగి అతను తనకు అవసరమున్నాయని చెప్పడంతో గట్టిగా మీదపడి రూ.50వేలు లాక్కుని వెళ్లిపోయారు. రెండురోజుల తర్వాత ఆ బాధితుడు సంబంధిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్, హోంగార్డుపై కేసు నమోదు చేశారు. కానీ అసలు సూత్రధారి ఆ స్టేషన్ సెక్టార్ 2 ఎస్ఐ మాత్రం ఈ వ్యవహారం నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. కానిస్టేబుల్‌తో కలిసి ఈ మొత్తం తతంగాన్ని నడిపిన ఎస్ఐని మాత్రం కేసు నుంచి తప్పించడంపై పోలీసు వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా దోపిడీకి పాల్పడ్డ కానిస్టేబుల్ శుక్రవారం రాత్రి నుంచే పరారీలో ఉన్నాడు. బాధితుడు పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడన్న సమాచారం అందించిన సదరు ఎస్ఐ సూచనల మేరకే కానిస్టేబుల్ తప్పించుకుపారిపోయాడని తెలుస్తోంది. నాన్‌బెయిలబుల్ కేసులయ్యాయని, దీంతో ఖచ్చితంగా రిమాండ్‌కు పోవలసి వస్తుందంటూ ఆ ఎస్ఐ చెప్పడంతో కానిస్టేబుల్ పారిపోయాడంటూ పీఎస్‌లో చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉండి డబ్బులు తీసుకున్న సబ్ఇన్స్పెక్టర్ మాత్రం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా పెట్రోలింగ్ డ్యూటీస్ రాసే రిజిస్టర్లో కూడా ఆ రోజు తాను డ్యూటీలో లేనట్లుగా చూపిస్తూ అందులో తన పేరు లేకుండా చేసుకున్నాడని తెలిసింది.
ఆ ఎస్ఐపై చర్యలుండేనా..!
ఈ దారిదోపిడీకి సూత్రధారి అయిన ఎస్ఐ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోవడంతో పెద్ద చర్చే జరుగుతోంది. తాము డబ్బులు చూశామని, వాటిని ఏం చేయాలంటూ అడిగిన కానిస్టేబుల్‌తో అతనిని బెదిరించి లాక్కురండని చెప్పినట్లుగా హోంగార్డు తన విచారణలో చెప్పినట్లు తెలిసింది. అయితే గతంలో రోలెక్స్ వాచ్ దొంగతనం చేసిన కేసులో కీలక అధికారిని కేసు నుంచి తప్పించి ఓ సాధారణ కానిస్టేబుల్‌ను బాధ్యుడిని చేస్తూ కేసును పక్కదోవ పట్టించిన ఉన్నతాధికారి ఈ వ్యవహారంలో కూడా సబ్ఇన్స్పెక్టర్ను తప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కానిస్టేబుల్‌ను పట్టుకుంటే మొత్తం వ్యవస్థ బయటకు వస్తుందని, అతనిని కేసు అయిన వెంటనే పారిపోవాలంటూ ఎస్ఐ ద్వారా ఆ ఉన్నతాధికారే సలహా ఇప్పించారట. ఆ అధికారికి ఎస్‌ఐనుంచి ప్రతీ నెలా రూ.20లక్షలకు పైగా ముడుపులు ముడుతున్నాయని, ఈ విషయంలో ఎస్ఐని విచారణకు పిలిస్తే తన పేరు బయటకు వచ్చే అవకాశముందంటూ భావించి డ్యూటీ బుక్‌లో ఎస్ఐ పేరు లేకుండా చేసుకోమని ఆ ఉన్నతాధికారే సలహా ఇచ్చినట్లు నిఘావర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎస్ఐ వ్యవహారం మొదటినుంచి తెలిసినా పెద్దసారు కూడా పట్టించుకోకపోవడానికి అతనికి ఉన్నతాధికారితో ఉన్న సంబంధాలే కారణమని, వారంతా డర్టీ డజన్బ్యాచ్తో సంబంధాలు ఉన్న వ్యక్తులనీ మాట్లాడుకుంటున్నారు. ఈ ఎస్ఐ అరాచకాలపై గతంలోనే చాలా ఫిర్యాదులున్నాయని, ఎస్బీ కూడా తన రిపోర్టులో ప్రతీసారి సబ్ఇన్స్పెక్టర్ అరాచకాలపై సాక్ష్యాలతో సహా ఇచ్చినా పెద్దగా పట్టింపులేదంటూ జోన్ పోలీసులు చెప్పుకుంటున్నారు. గతంలో రోలెక్స్ వాచ్ విషయంలో రచ్చకెక్కిన అదే పోలీసు స్టేషన్ తిరిగి మరోసారి దారిదోపిడీ వ్యవహారంతో పోలీసుశాఖకే అప్రతిష్ట మూటగట్టింది.
లేడీడాన్ నీతూభాయ్ అరెస్టు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): గంజాయి అక్రమ రవాణా, అమ్మకాల్లో ఆరితేరిన లేడీ డాన్ కళాపతి నీతూభాయ్ మరోసారి పోలీసులకు పట్టుబడింది. సాంకేతిక నిఘా, క్షేత్రస్థాయి సమాచారంతో నీతూభాయ్ కదలికలను గుర్తించిన ఈగల్ ఫోర్స్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో మంగళ్‌హాట్ వైపు ఆటోలో వెళ్తుండగా ఆమెను అరెస్టు చేశారు. రోజూ దాదాపు రూ.25 లక్షల విలువైన గంజాయి విక్రయాలు జరుపుతున్నట్టు అనుమానిస్తున్న ఆమె నుంచి రూ.1,59,500 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2017 నుంచి ఈ దందా కొనసాగిస్తున్న నీతూభాయ్.. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా గంజాయి కొనుగోలు చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. నీతూ భాయ్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో 30 ఎన్డీపీఎస్, ఎక్సైజ్ కేసులు నమోదైనట్టు ఈగల్ పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

