Fire accident | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..!
Fire accident | నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణ దశలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
యాదాద్రి : నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణ దశలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని యూనిట్-3లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనిట్-3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీక్ కావడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు.
చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి, ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలోని కంట్రోల్ కేబుళ్లు, కొన్ని కీలకమైన వాల్వ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్లాంట్ సిబ్బంది, అక్కడే ఉన్న అగ్నిమాపక యంత్రాలు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దాంతో బాయిలర్లు, మెయిన్ టర్బైన్లు వంటి ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న తెలంగాణ జెన్కో ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయడంతో పాటు, ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి అంతర్గత విచారణకు ఆదేశించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

