హైదరాబాద్ : యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన గో మహాగర్జన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గో మహాగర్జన సభ వేదికపై అగ్నిప్రమాదం సంభవించింది. సభా వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణంగా సమాచారం. కాగా అందరూ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
గో మహాగర్జనలో అపశ్రుతి.. సభా వేదికపై గుడారాలు దగ్ధం pic.twitter.com/3hzu0bdoEX
— Namasthe Telangana (@ntdailyonline) April 1, 2021