హైదరాబాద్ : బేగంపేట ఎయిర్పోర్టు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయం పాత రన్వేకు సమీపంలోని చెత్తకుప్పలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.