Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rice Price | సన్నబియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు క్వింటాలు రూ.6వేల నుంచి రూ. 7 వేలకు పలికిన ధరలు ఇప్పుడు అమాంతం హైక్ అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే 25 నుంచి 35 శాతం వరకు పెరిగి చుక్కలు చూపుతున్నాయి.
Rice Price | సన్నబియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. మొన్నటివరకు క్వింటాలు రూ.6వేల నుంచి రూ. 7 వేలకు పలికిన ధరలు ఇప్పుడు అమాంతం హైక్ అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే 25 నుంచి 35 శాతం వరకు పెరిగి చుక్కలు చూపుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో మరో 30 శాతం పెరిగే అవకాశాలుండగా, పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం, ఇతర రాష్ట్రాల బ్రోకర్లు కల్లాల మీద నుంచే వడ్లను తన్నుకుపోతుండడం, మరోవైపు స్థానిక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిన సర్కారు, ధరలను నియంత్రించడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తేరుకొని రైతులకు అన్యాయం జరగకుండా బహిరంగ మార్కెట్ ధరతో పచ్చివడ్లను కొనుగోలు చేస్తేనే.. ధరలు అదుపులో ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే మున్ముందు పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / హుజూరాబాద్ : మన రాష్ట్రంలో పండే బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ వంటి తదితర సన్నరకాల బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నది. పొరుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూర్, చెన్నై వంటి ప్రాంతాలతోపాటు విదేశాల్లోనూ మంచి ఆద రణ ఉన్నది. అయితే ఈ సారి ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థి తులు ఏర్పడడం, ఆయా రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మన ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డితోపాటు సన్నాలు పండించే జిల్లాల్లో రైతు లకు అడ్వాన్స్‌లు ఇస్తూ.. కోతల మీద నుంచే కొనుగోళ్లు చేస్తున్నారు. వారం క్రితం వరకు క్వింటాలు రూ.3,800 పెట్టిన వ్యాపారులు, ఇప్పుడు రూ. 4వేల నుంచి రూ.4,200 వరకు పెడుతున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు, తరుగు, చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండడంతో రైతులు కూడా వ్యాపారులకు అమ్మేందుకే ఇష్ట పడుతున్నారు. అసలే ఎల్న్ని కారణంగా సాగు తగ్గడం, ఉన్న సనరకం ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలుతుండ డంతో మన రాష్ట్రంలో సన్నబియ్యం సంక్షోభం రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే.. సన్నబియ్యం కొనాలంటే జనం జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికే కొండెక్కిన ధరలు
సన్నరకం బియ్యం ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతు న్నాయి. నెల రోజుల్లోనే క్వింటాలుకు 25 నుంచి 35 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు చూస్తే.. జైశ్రీరామ్ పాత బియ్యం నెల క్రితం క్వింటాలుకు రూ.6,800 ఉంటే, ఇప్పుడు అది రూ.8,500కు పెరిగింది. అలాగే సాంబామ సూరి నెల క్రితం రూ.4,600 ఉంటే, ప్రస్తుతం 800 చేరింది. రూ.5,800 ఉన్న హెచ్ఎంటీ ఇప్పుడు రూ.7వేలు అయింది. ఆర్ఎన్ఆర్ (స్టీమ్) నెల క్రితం రూ.5,800 ఉంటే, ప్రస్తుతం రూ.7,200కు పెరిగింది. రాబోయే ఒకటి రెండు నెలల్లో మరో 25 నుంచి 30 శాతం పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబు తున్నాయి. ఈ పరిస్థితుల్లో వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయాల్సిన సర్కారు, నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 ఉన్నది. అయితే.. బీపీటీ, ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, జైశ్రీరామ్, హెచ్ఎంటీ, తెలీంగాణ సోనా, డబ్ల్యూజీఎల్ ఇలా మొత్తం ఏడు రకాల సన్నాలకు బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తామని చెప్పింది. కానీ, మార్కెట్లో ప్రస్తుతం సన్న రకం ధాన్యానికి రూ.4వేలకుపైగా ధర పలుకుతున్నది. ఈ నేపథ్యంలో సర్కారు ఇప్పటికైనా తేరుకొని, ధరలను నియం త్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
సామాన్యుల బడ్జెట్‌పై ప్రభావం
బియ్యం ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్ తలకిందులవు తున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఆందోళన వ్యక్తమవుతున్నది. సర్కారు ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. సన్న బియ్యం ధరలు తమ అంచనాలకు అందకుండా పెరిగాయని, పాత నాణ్యమైనబియ్యం కిలో ధర వందకు చేరిందని, ఇలా అయితే తాము బతికేదెలా అని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ధరలు పెరగకుండా ఉండాలంటే హోల్‌సేల్ గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి, కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని కోరుతున్నారు. అలాగే అక్రమ నిల్వలు, ఉద్దేశపూర్వకంగా సరఫరా నిలిపివేయడం వంటి ఉల్లంఘనలకు పాల్ప డకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, సన్నరకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కొనాలని కోరుతున్నారు. అలా అయితేనే బియ్యం ధరలు అదుపులో ఉంటాయని చెబుతు న్నారు. ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ధాన్యంపై వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ, సరిహద్దులు దాటకుండా కట్టడి చేయాలని, లేదంటే సన్నాల సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బియ్యం ధర చూస్తే భయమేస్తున్నది
మునుపటితో చూస్తే బియ్యం రేటు రెండింతలైంది. ధరలు చూస్తే భయమే స్తున్నది. ఇలా ఉంటే సామాన్యుల నెల వారీ ఖర్చులు భరించడం కష్టమవు తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకొని బియ్యం ధరలు నియంత్రించాలి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే అధికారులు దాడులు జరపాలి. కొత్త బియ్యం కొను గోలు చేద్దామనుకుంటే అన్నం ముద్దగా అవుతుంది.
– పాకాల రవీందర్ రెడ్డి, హుజూరాబాద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

