Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురుచూ స్తోంది. చేతిలో డబ్బులు లేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో దాతలు ఆదు కోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Rajanna Sircilla | కోనరావుపేట, అక్టోబర్ 22 : అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన ఓ ఫీల్డ్ అసిస్టెంట్ మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురుచూ స్తోంది. చేతిలో డబ్బులు లేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో దాతలు ఆదు కోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన పులి స్వప్న కొన్నేళ్లుగా అదే గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త రాజు కూలీ పనులు చేస్తుండగా, ఇద్దరు కుమార్తెలు నక్షత్ర, శివా త్మిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుం టున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పరిమిత వేతనంతోనే స్వప్న కుటుంబాన్ని నెట్టుకొ స్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం స్వప్న అనారోగ్యానికి గురైంది. దీంతో సిరిసి ల్లలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా, గర్భసంచి తొలగించాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం ఉండడంతో సుమారు రూ. 2 లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు.
అయితే, ఆపరేషన్‌కు ముందు స్వయంగా నడిచిన స్వప్న, శస్త్రచికిత్స అనంతరం ఇంటికొచ్చిన ప్పటి నుంచి మంచానికే పరిమితమైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ విషయమై తిరిగి దవాఖాన వైద్యు లను సంప్రదించగా, సరైన సమాధానం లభించలేదని స్వప్న వాపోయింది. ప్రస్తుతం మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే సు మారు రూ. 5 లక్షలు అత్యవసరమని వైద్యు లు సూచించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అప్పులపాలైన కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని సమకూ ర్చుకోవడం కష్టంగా మారింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న స్వప్న కు టుంబం దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. స్వప్నను ఆదుకో వాలని కలెక్టర్ గరిమా అగ్ర వాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్ప థంతో స్పందించి ఆర్థిక సాయం అందించా లని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థిక సాయం చేయా లను కునే వారు.. ఖాతాదారుని పేరు పులి స్వప్న, బ్యాంకు : బ్యాంక్ ఆఫ్ బరోడా, శాఖ : కనగర్తి, ఖాతా నంబర్ : 80930 10000 1141, ఐఎఫ్సీకోడ్ : BARBO (ZERO)VJKNGA, ఫోన్ పే, గూగుల్ పే 8978398425 నంబర్‌కు చేయగలరు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

