Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Rahul Sankrityan | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ పేరుతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
Rahul Sankrityan | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ పేరుతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
అనంతపురంలో జరిగిన వేడుకలో రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. తనకు అనంతపురంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. ఇక్కడి థియేటర్లలోనే ‘ఇంద్ర’, ‘నరసింహ నాయుడు’ వంటి సినిమాలు చూశాను. రాప్తాడు రోడ్డులో కెమెరా పట్టుకుని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఒక సినిమాను ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ఇక్కడే నేర్చుకున్నాను. దర్శకుడిగా నా ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం అనంతపురం. ఇప్పుడు ఇదే ప్రాంతంలోని థియేటర్లలో నా సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతుండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు.
రాయలసీమ ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని, మరోసారి అదే విషయాన్ని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. ‘రణబాలి’ ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, ఇలాంటి కథను వాణిజ్య చిత్రంగా రూపొందించడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డారు.‘ఇంత మంచి సినిమా వచ్చినప్పుడు కూడా కొందరు నెగెటివిటీని వ్యాప్తి చేశారు. కొంతమంది రివ్యూయర్స్ సినిమాను నెగెటివ్‌గా చూపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ మంచి సినిమాను ఎవరూ ఆపలేరని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అని రాహుల్ అన్నారు. ఇక ఈ వేడుకలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ చేసిన మరో కామెంట్ చర్చనీయాంశంగా మారింది. సినీ పరిశ్రమలో ప్రాంతాలను సూచించేందుకు ఉపయోగించే ‘సీడెడ్’, ‘నైజాం’ పదాలకు బదులుగా ‘రాయలసీమ’, ‘తెలంగాణ’ అనే తెలుగు పేర్లను ఉపయోగించాలని ఆయన కోరారు.
‘‘మనకు అందమైన తెలుగు పదాలు ఉన్నాయి. ట్రేడ్ వర్గాలు, మీడియా కూడా ఇకపై ‘సీడెడ్’, ‘నైజాం’ అనే పదాలకు బదులుగా ‘రాయలసీమ’, ‘తెలంగాణ’ అని పిలిస్తే సంతోషిస్తాను. ఆ పదాలు బానిసత్వాన్ని గుర్తుచేస్తాయని నా అభిప్రాయం. మన ప్రాంతాలకు ఉన్న తెలుగు పేర్లను ఉపయోగిద్దాం అని రాహుల్ విజ్ఞప్తి చేశారు. చివరగా ‘రణబాలి’కి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఈ సినిమాను తన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకుంటానని దర్శకుడు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

