Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Paris Shooting: పారిస్‌లో కాల్పుల ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆటోమెటిక్ గన్‌తో ఫైరింగ్ చేశాడు. ఆ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 5 మంది గాయపడ్డారు. దీన్ని రేసిస్ట్ టెర్రర్ అటాక్‌గా దేశాధ్యక్షుడు మాక్రన్ ప్రకటించారు.
పారిస్: పారిస్ శివారులో ఓ సాయుధ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు(Paris Shooting) జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 5 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగించిన ఉన్మాదిని అరెస్టు చేశారు. అయితే ఆ సాయుధుడు జాతివివక్ష దాడికి పాల్పడినట్లు ఫ్రెంచ్ అధికారులు భావిస్తున్నారు. నల్లజాతీయులు, ముస్లింలను అతను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నార్త్ ఆఫ్రికాకు చెందిన శరణార్థులను ఉన్మాది కాల్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక బలగాలు కేసును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దేశాధ్యక్షుడు
ఎమ్మాన్యువల్ మాక్రన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రేసిస్ట్ టెర్రర్ అటాక్ జరిగిందని ఆయన అన్నారు. అనుమానిత వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముందస్తుగానే ఈ దాడి ప్లాన్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. చర్మం రంగు లేదా వారి మతం ఆధారంగా ఆ ప్రజల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోందని మాక్రన్ చెప్పారు. పారిస్‌కు పశ్చిమ దిశలో ఉన్న ట్రాప్పిస్ శివారు ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఇలాంటి ఘటనలకు ఫ్రాన్స్‌లో చోటు లేదని, 15 నిమిషాల వ్యవధి తేడాలో మూడు చోట్ల కాల్పుల ఘటనలు జరిగినట్లు మంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు.
కాల్పులు జరిపిన అనుమానిత వ్యక్తిని కెవిన్‌గా గుర్తించారు. అతను 1987లో జన్మించాడు. అతని క్రిమినల్ రికార్డు పరిశీలిస్తే అతనిపై గతంలో నాలుగు కేసులు బుక్ అయ్యాయి. కానీ వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఉన్మాది కారులో ఓ సబ్‌మెషీన్ గన్, టియర్ గ్యాస్‌ను గుర్తించారు. అతని అపార్ట్మెంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు, టైమర్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నట్లు విచారణలో తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

