కట్టంగూర్, సెప్టెంబర్ 2 : కట్టంగూర్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల తుది ఓటరు జాబితాను మంగళవారం ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు విడుదల చేసి నోటీసు బోర్డులో ప్రదర్శించారు. మండలంలోని 206 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓటర్లు 37,362 మంది ఉండగా అందులో పురుషులు 18,565, స్త్రీలు 18,797 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీజీ స్వరూపారాణి, కార్యాలయ పర్యవేక్షకుడు చింతమల్ల చలపతి, సీనియర్ అసిస్టెంట్ సులోచన. కట్టంగూర్ పంచాయితీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.