హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టానికి చేయనున్న సవరణలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ సంస్కరణలపై కేంద్రంతో పోరాడాలని విద్యు త్తు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఇటీవల తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బీ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుధీర్, సహ కార్యదర్శులు సీహెచ్ శంకర్, వరప్రసాద్, నాయకులు పద్మారెడ్డి, జనార్దన్‌రెడ్డి బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. కేంద్ర విద్యుత్తు చట్టంపై వారితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యు త్తు సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కేంద్రం వైఖరితో రాష్ట్రానికి, రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.