Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్‌లోని కన్హాయిగూడ - గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది బృందం అటవీ ప్రాంతంలో

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్‌లోని కన్హాయిగూడ – గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది బృందం అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. బలగాలను గమనించిన మావోలు వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరుపడంతో తూటాలకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు మృతి చెందినట్లు సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ధ్రువీకరించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నుంచి ఏడుగురు మావోలు మృతి చెంది ఉంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. గతవారం నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ దాడిలో ఇద్దరు ఐటీబీపీ జవాన్లు మృతిచెందారు. కడేమెట శిబిరం నుంచి 600 మీటర్ల దూరంలో సైనికులు దాడులకు తెగబడ్డారు. బలగాలకు చెందిన ఏకే-47 రైఫిల్, రెండు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, వాకీటాకీని ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల క్రితం భద్రతా దళాలు దంతెవాడ జిల్లాలో ముగ్గురు నక్సలైట్లను అరెస్టు చేశాయి. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

