హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 3 : నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొన్ని అర్హత లేని పోలీస్ కోచింగ్ సెంటర్లు వారిని నిలువునా దోచుకుంటున్నా యి. శిక్షణ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా యి. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వరంగల్ నగరంలో శిక్షణ పొందేందుకు వచ్చే యువతకు నకిలీ అకాడమీలు గాలం వేస్తున్నాయి. సరై న వసతులు, నిపుణులైన ఫ్యాకల్టీ లేకుం డా భారీ ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను ఆకర్షించి వేల రూపాయ లు ఫీజుగా దండుకుంటూ మోసం చేస్తున్నాయి.
నకిలీ కోచింగ్ సెంటర్లకు హనుమకొండ కిషన్‌పుర, నయీంనగర్ కేంద్రంగా మారాయి. కనీస నిబంధనలు, ఎలాంటి అర్హత లేకుండా అకాడమీలు నిర్వహిస్తున్నా రు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లతో నిర్వహించాల్సిన అకాడ మీ సెంటర్లు పోలీస్ యూనిఫాం వేసి డ్యూటీలో ఉన్న వారే నడిపిస్తున్నారు. నాణ్యతలేని బోధన, అనుభవంలేని అధ్యాపకులతో నామమాత్రపు తరగతులు నిర్వహిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. వంద శాతం ఉద్యోగం అంటూ వాగ్ధానాలు చేయడం, తప్పుడు హామీలు ఇస్తూ దోచుకుంటున్నారు. ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
నగరంలో అకాడమీలు నడిపిస్తున్న పలువురు నిర్వాహకులపై పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలుస్తోంది. వివిధ కేసుల్లో ఇరుక్కొని కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అనుభవనం లేని ఫ్యాకల్టీ, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయిన ఓ పోలీసు అకాడమీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, కిషన్‌పురలో ఉన్న ఆయన దుకాణం వరంగల్‌కు మార్చినట్లు తెలుస్తోంది.
పోలీసులు విధుల్లో ఉంటూ ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిందిపోయి ఓ ఖాకీ కిషన్‌పురలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పోలీసు డ్రెస్ వేసుకుని చదువు చెప్పొద్దని నిబంధనలు ఉన్నా లెక్క చేయడం లేదు. తరగతి గదుల్లో గన్లతో కోచింగ్ ఇస్తున్నా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు వాపోతున్నారు. నగరానికి వచ్చి అవగాహన లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అకాడమీల్లో చేరి మోసపోవద్దని, ఆలోచించి అడుగు వేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.