ఓటు హకును విధ్వంసం చేస్తే పోరాటాలు తప్పవు
మార్పులు, చేర్పులు, కూర్పుల పేరుతో రాజ్యాంగం కల్పించిన ఓటు హకును విధ్వంసం చేసే చర్యలకు పాల్పడితే సహించేది లేదని, ఓటు హకును కాపాడుకోడానికి ప్రజాపోరాటాలు తప్పవని రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక వేదిక(ఎఫ్‌సీడీ) హెచ్చరించింది.
- రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక వేదిక
హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మార్పులు, చేర్పులు, కూర్పుల పేరుతో రాజ్యాంగం కల్పించిన ఓటు హకును విధ్వంసం చేసే చర్యలకు పాల్పడితే సహించేది లేదని, ఓటు హకును కాపాడుకోడానికి ప్రజాపోరాటాలు తప్పవని రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక వేదిక(ఎఫ్‌సీడీ) హెచ్చరించింది. ‘ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్)-రాజ్యాంగబద్ద ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై ఈ నెల 22న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ప్రజాసదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను, కరపత్రాన్ని గురువారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారకభవన్‌లో విడుదల చేసింది.
ఎఫ్‌సీడీ కన్వీనర్ డాక్టర్ కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు చూస్తుంటే ప్రభుత్వ జేబుసంస్థగా మారిందన్న అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఓటర్ల పేర్ల తొలగింపు, మార్పులకు సంబంధించిన అంశాలపై ఆందోళన వ్యక్తంచేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది జీ జ్యోతికిరణ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక వేదిక ఏర్పాటైన తర్వాత, హైదరాబాద్‌లో 22న నిర్వహిస్తున్న తొలి బహిరంగ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

