తండ్రి అయినా తల్లి అయినా.. మొదటి సారి.. తాము తండ్రి అయ్యాము.. తల్లి అయ్యాము.. అని తెలుసుకొని చాలా ఎగ్జయిట్ అవుతారు. భావోద్వేగానికి గురవుతారు. తల్లిదండ్రులు అయ్యాక.. వాళ్ల బాధ్యత ఇంకా పెరుగుతుంది. తొలిసారి తల్లితండ్రి అయినప్పుడు అయితే ఇక వాళ్ల ఆనందానికి హద్దులే ఉండవు.
ఇలాగే.. ఓ తండ్రి.. తనకు కొడుకు పుట్టాడని తెలుసుకొని ఫుల్ ఖుషీ అయ్యాడు. ఆసుపత్రికి వచ్చి ఎప్పుడు కొడుకును చూడాలా.. అని తహతహలాడాడు.
నర్సు అప్పుడే పుట్టిన బాబును తీసుకొచ్చి.. తండ్రి చేతుల్లో పెట్టింది. దీంతో ఆ తండ్రి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. తన కొడుకును చేతుల్లో పట్టుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అయితే ఆ తండ్రి భావోద్వేగాన్ని చూసి చలించిపోతున్నారు.
First-time father holds his newborn baby for the first time. (🎥:Chrisxia29_)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 19, 2021
pic.twitter.com/C7s63CMpGv
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
Viral Video : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఈ బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు