ORR Accident | హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ఢీకొని తండ్రి, రెండున్నరేళ్ల కుమారుడు దుర్మరణం చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండకు చెందిన కాటంగూరి వేద ప్రకాశ్ రెడ్డి (37) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం హన్మకొండలో దేవుడి పండుగ ఉండటంతో కుటుంబంతో కలిసి తన కారులో బెంగళూరు నుంచి వచ్చాడు. మంగళవారం నాడు భార్య హిమబిందు, రెండున్నరేళ్ల కొడుకు అర్జున్‌తో పాటు కజిన్ దుర్గాప్రసాద్, అతని భార్య శ్రీజతో కలిసి తన కారులో బెంగళూరు బయల్దేరాడు.
ఈ క్రమంలో ఘట్కేసర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కారు. పెద్ద అంబర్‌పేట వద్ద నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న వేద ప్రకాశ్, అతని కొడుకు అర్జన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, మిగతా ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొని తండ్రి, రెండున్నరేళ్ల కొడుకు దుర్మరణం
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో బెంగుళూరులో నివసిస్తున్న హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి(37), అతని కజిన్ సోదరుడు… pic.twitter.com/KvIzuUcIjy
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026