Kiran Abbavaram | ఏమి లేనప్పుడు నాకు అండగా నిలిచింది.. భార్యపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్
Kiran Abbavaram | తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన సమర్పణలో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుమారు 25 మందికి పైగా కొత్త నటీనటులను, దర్శకుడు వి. మునిరాజ్ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram | తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన సమర్పణలో రూపొందిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుమారు 25 మందికి పైగా కొత్త నటీనటులను, దర్శకుడు వి. మునిరాజ్ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎంతో భావోద్వేగభరితంగా సాగింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చేసిన ప్రసంగం అందరినీ కదిలించింది. “ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. పల్లెల నుంచి పెద్ద కలలతో వచ్చిన సుమారు 50 మంది టెక్నీషియన్లు, నటీనటుల జీవిత స్వప్నం” అని ఆయన తెలిపారు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎవరినీ సహాయం కోరలేదని చెప్పిన కిరణ్, ఈసారి మాత్రం కొత్తవారి కష్టానికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో పరిశ్రమ పెద్దలు, విమర్శకులు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ వేడుకలో ఆయన తన భార్య, నటి రహస్య గోరఖ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి. తాను హీరో కాకముందు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో రహస్య తనకు అండగా నిలిచిందని చెప్పారు.
అవకాశాల కోసం తిరిగిన రోజుల్లో కూడా ఆమె నన్ను నమ్మింది. తినడానికి కూడా కష్టమైన సమయంలో ఇంటి నుండి భోజనం తీసుకువచ్చి నన్ను ఆదుకుంది. నేను హీరో అవుతానని విశ్వసించి నా చేయి పట్టుకుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న సినిమా అయినప్పటికీ టెక్నికల్ పరంగా ఎక్కడా రాజీ పడలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మ్యూజిక్, సౌండ్ డిజైన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు.ఇంకా ఈ చిత్ర బృందం కష్టానికి గుర్తింపుగా, వారి కుటుంబ సభ్యుల కోసం భారతదేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

