Peddi |మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే సినిమా ఔట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
ఇటీవల రామ్ చరణ్ ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం చేసిన స్టైలిష్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలపై స్పందిస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా “సార్… వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్” అంటూ కామెంట్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, అనుబంధం చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెద్ది’ తర్వాత కూడా ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ఉండబోతుందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా బుచ్చిబాబు సినిమాల్లో పాటలకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ పాటలు ఆయన స్టైల్. ఈ స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఎవరు డ్యాన్స్ చేస్తారు అనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అవకాశం మృణాల్ ఠాకూర్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్, ఇప్పుడు మొదటిసారి మాస్ సాంగ్‌లో కనిపించబోతుందనే వార్తలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన మరో సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇక ఏ ఆర్ రెహమాన్ అందించిన ఈ మాస్ ట్యూన్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.