వాషింగ్టన్: ఇరాన్‌తో చేపట్టిన యుద్ధం దాదాపు ముగిసినట్లు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ టీవీ ఛానల్ హోస్ట్ మారియా బార్టిరోమోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆ ఇంటర్వ్యూ ప్రసారం కానున్నట్లు ఆమె తెలిపారు. మార్నింగ్స్ విత్ మారియా అన్న షోలో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయనున్నారు. ఇరాన్‌తో యుద్ధం ముగియడానికి దగ్గరపడిందని ట్రంప్ అన్నారు. ఇరాన్ సంక్షోభంపై ట్రంప్‌ను పదేపదే ఆమె ప్రశ్న అడిగారు, వార్ ముగిసిందా అని ఆమె ప్రశ్నించారు. బహుశా ముగిసిందే అనుకుంటా అని ట్రంప్ పేర్కొన్నారు.
ఒకవేళ యుద్ధం చేయకుంటే, బహుశా ఇప్పటికే ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండేదని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఇరాన్ కనుక అణు ఆయుధాన్ని కలిగి ఉంటే, మీరంతా వారిని సర్ అనేవారని.. మీరేమి చేయలేరా అని అడిగేవారన్నారు. నిజంగా వార్ ముగిసిందా అని యాంకర్ మరోసారి సూటిగా ప్రశ్న వేయడంతో.. ముగింపు దశకు చేరుకున్నట్లు ట్రంప్ సంకేతం ఇచ్చారు. యుద్ధం ముగియడానికి దగ్గరపడిందని అనుకుంటానని, దాదాపు ముగిసిందనే అనుకుంటానని ట్రంప్ తెలిపారు.
ఒకవేళ ఇప్పటికిప్పుడే ఆ యుద్ధం నుంచి తాము తప్పుకుంటే, ఇరాన్ మళ్లీ పునర్ నిర్మాణం చెందాలంటే ఆ దేశానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని ట్రంప్ తెలిపారు. కానీ తమ పనిని ఇంకా పూర్తి చేయలేదని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
NEW: President Trump says the war with Iran is “close to over.”
Full interview airs on @MorningsMaria on Fox Business at 6 a.m. pic.twitter.com/7YqjbHW3Fy
— Fox News (@FoxNews) April 15, 2026
ఏబీసీ న్యూస్ రిపోర్టర్ జోనాథన్ కార్ల్తోనూ ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ను పొడిగించాలన్న ఆలోచన లేదని ట్రంప్ పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. సీజ్ఫైర్ పొడిగింపు అవసరం ఉండకపోవచ్చు అని ట్రంప్ వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో ఎన్నో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇరాన్‌తో రెండో దఫా చర్చలు నిర్వహించేందుకు అమెరికా ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఏదో ఒక ముగింపు ఉంటుందని, డీల్ కుదిరితే, వాళ్లు పునర్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇరాన్లో ఇప్పుడు అధికార మార్పిడి జరిగిందని, రాడికల్స్‌ను రూపుమాపామని, వాళ్లను ఏరివేశామని, ఇక ఏ సమస్య ఉండబోదన్నారు. ఒకవేళ తానే కనుక దేశాధ్యక్షుడిని కాకుంటే, అప్పుడు ఈ ప్రపంచం ముక్కలయ్యేదని ట్రంప్ అన్నారు.