రామాయంపేట : తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో చేట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.తడిచిన వరి ధాన్యమును వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.