జోగులాంబ గద్వాల : దుక్కి దున్నినప్పటి నుంచి పంట ఇంటికొచ్చేంత వరకు రైతన్నల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ప్రకృతి సహకరిస్తే ప్రభుత్వం సహకరించకపోవడం పట్ల అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwala ) జిల్లా రైతులు పంటను కాపాడుకునేందుకు అవసరమయ్యే ఎరువులను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో అనుక్షణం ఎరువుల రాక కోసం పడిగాపులు కాస్తున్నారు.
ముఖ్యంగా యూరియా ( Urea ) ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ కేంద్రాల వద్ద నిద్రాహారాలు మాని క్యూలైన్లో రోజంతా నిలబడుతున్నారు. అయినా యూరియా దొరుకుతుందన్న నమ్మకం రైతులకు కలగడం లేదు. మహిళా రైతుల సైతం పనులన్నీ మానుకొని యూరియా కోసం గంటల తరబడి వేచి చూడడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోతున్నారు . గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు కూడా యూరియా కోసం గంటల తరబడి వరుసలో నిలబడలేదని మహిళా రైతు గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.