మెదక్, జూన్ 13(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాను నైరుతి పలకరించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హవేళీ ఘనపూర్‌లో 21.7 మి.మీటర్లు వర్షం పడింది.
చేగుంటలో 44.3.మి.మీ, చిన్నశంకరంపేటలో 28.6 మి.మీ, మెదక్‌లో 17.1 మి.మీ, కుల్చారంలో 15.2 మి.మీ, చిలిపిచెడ్ 17.5 మి.మీ, నర్సాపూర్‌లో 51.5 మి.మీ, శివ్వంపేటలో 30.6 మి.మీ,వెల్దుర్తిలో 25.5 మి.మీ, తూప్రాన్‌లో 37.6మి.మీ, మనోహరాబాద్‌లో 40.2 మి.మీ, మాసాయిపేటలో 27.5 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. తొలకరి వర్షం పడడంతో రైతులు వ్యవసాయ భూములు దన్నడంతో పాటు వరితూకాలు పోసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.